calender_icon.png 9 May, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

08-05-2025 12:36:50 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, మే 7 : రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం పై సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాం బర్ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వర్షాకాలంలో ప్రజలు దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికన్ గుని యా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడకుం డా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. దోమల నివారణకు వారంలో రెండు రోజు లు డ్రై డే పాటించడం, ఫాగ్ మిషన్లు సిద్ధం చేసుకోవడం, జ్వరం సర్వే, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవడం వంటివి ముందస్తుగా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ రామచంద్ర రావు, డాక్టర్ పరిమళ, డాక్టర్ మంజుల పాల్గొన్నారు.