4 April, 2026 | 2:41 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

కోలిండియా స్థాయి పోటీలో రాణించాలి

25-10-2025 12:00 AM

మందమర్రి, అక్టోబర్ 24 : సింగరేణి కార్మిక క్రీడాకారులు, కళాకారులు కోలిండియా స్థాయిలో జరిగే పోటీల్లో ప్రతిభ కన బరిచి, సింగరేణి సంస్థకు ఏరియాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఏరియా సీనియర్ పిఓ, క్రీడల గౌరవ కార్యదర్శి ఎం కార్తీ క్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, కేకే 5 గని పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ లు కోరా రు. ఏరియా వరక్స్ పీపుల్స్ స్పోరట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో 61వ వార్షిక క్రీడల్లో భాగంగా పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన అవుట్ డోర్ హాకీ పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై, పోటీలను ప్రారంభించి మాట్లాడారు.

సింగరేణి ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీ ల్లో పాల్గొనే క్రీడాకారులు, కళాకారులు కోలిండియా స్థా యిలో ప్రతి సంవత్సరం ఎన్నో బహుమతు లు సాధించి, సింగరేణికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారన్నారు. సీనియర్ క్రీడాకారు లు సంస్థలో పని చేస్తున్న యువ ఉద్యో గులను, క్రీడలకు ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాక శారీరక దృఢత్వానికి సైతం తోడ్పడతాయని తెలిపారు. ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పు డే సంస్థ అభివృద్ధికి దోహదం చేసిన వారవుతారన్నారు. ఈ పోటీల్లో కేకే గ్రూప్ విజే తలుగా నిలువగా, కాసీపేట, శాంతిఖని గ్రూప్ రన్న ర్స్‌గా నిలిచారు. ఈ కార్యక్రమంలో  స్పోరట్స్ కోఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శాఖ శ్రీనివాస్, కార్మిక క్రీడాకారులు పాల్గొన్నారు.