calender_icon.png 25 October, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన దరఖాస్తులు.. పెరిగిన ఆదాయం

25-10-2025 12:00:00 AM

-గత ఏడాది కంటే 8.39 కోట్ల ఆదాయం పెరుగుదల

-27న లక్కీ డ్రాకు ఏర్పాట్లు

నిర్మల్ అక్టోబర్ 24 (విజయ క్రాంతి) : ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నూత న మధ్య పాలసీ టెండర్ల ప్రక్రియ గురువారంతో మూసింది. జిల్లాలో మొత్తం 47 మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను ఎక్సై జ్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈనెల 18 వరకు టెండర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఆ గడువును 23 వరకు కొనసాగించింది. జిల్లాలో మొత్తం 47 షాపులకు 991 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి 29.73 కోట్ల ఆదాయం సమకూ ర్చింది.

రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లను 10 67 దరఖాస్తులు రాగా 21.10 కోట్ల ఆదాయం రాగా ఈసారి డిపాజిట్ ఫీజులు మూడు లక్షలకు పెంచడంతో అదనంగా 8.39 కోట్ల ఆదాయం లభించినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 2025 27 రెం డు సంవత్సరాల మద్యం పాలసీగాను మద్యం షాపులు దక్కించుకునేందుకు ఈసా రి పెద్ద ఎత్తున వ్యాపారులు ఉద్యోగులు రియల్ ఎస్టేట్లు రాజకీయ నాయకులు బినామీ పేర్లతో టెండర్లు వేసినట్టు ప్రచారం జరుగుతుంది.

ఎక్సైజ్ శాఖ కూడా ఈసారి మద్యం ఆదాయ వనరులను పెంచుకునేందుకు జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వ హించి మద్యం టెండర్ల ద్వారా కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం చేసి దరఖాస్తుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకున్నా రు. అయితే దరఖాస్తుల సంఖ్య పెరిగినప్పటికీ ఆదాయం పెరగడంతో వారు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఈనెల 27న జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసిన టెండర్దారులకు లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.