24-10-2025 10:58:46 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పాత్రికేయులు సామాజిక సేవకులని, పాత్రికేయ వృత్తి కత్తి మీద సాములాంటిదని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. శుక్రవారం ఆయన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు రావి కోటేశ్వరలింగం (శ్రీరాంపూర్), జిలుకర రమేష్(మొట్లపల్లి)ల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రావి కోటేశ్వరలింగం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గత నాలుగు నెలలుగా వైద్యుల సూచన మేరకు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.
బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా అతడు బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈర్ల సమ్మయ్య కోటేశ్వరలింగం ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు. యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మరో ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు జిలుకర రమేష్ (మొట్లపల్లి) ను పరామర్శించారు. అతని ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రమేష్ కాలికి తీవ్ర గాయమై, ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. అతడు రెండు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి మొట్ల పెల్లిలోని తన ఇంటికి వచ్చాడు.
విషయం తెలుసుకున్న ఈర్ల సమ్మయ్య శుక్రవారం మొట్లపల్లిలోని అతని నివాసాన్ని సందర్శించి, పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాత్రికేయులు రావి కోటేశ్వరలింగం, జిలుకర రమేష్ లు త్వరగా కోలుకోవాలని ఈర్ల సమ్మయ్య ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి ఎంతో గొప్పదని, సమాజంలో మార్పు తీసుకురావడానికి రాత్రింబగళ్లు వారు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట ప్రముఖ కళాకారుడు పాల శంకర్ ఉన్నారు.