01-05-2025 11:18:25 PM
జిల్లాలోని ముఖ్య కాంగ్రెస్ ప్రజాప్రతిని హాజరు కావాలి..
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస శ్రీనివాస రావు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పార్లమెంట్ సభ్యులు సురేశ్ కుమార్ శెట్కార్ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావ్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావ్, ఆగ్రో చైర్మన్ కాసుల బల్ రాజు, మాజీ శాసన సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు సయ్యద్ యూసూఫ్ అలీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీ లు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు.