calender_icon.png 3 December, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు!

03-12-2025 12:32:02 AM

  1. అవసరం లేదనుకుంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు
  2. కేంద్ర ప్రభుత్వం స్పష్టత

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ‘సంచార్ సాథీ’ సైబర్ సెక్యూరిటీ యాప్ తప్పనిసరి కాదని, అవసరం లేదనుకుంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని మంగళవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. మొబైల్స్‌లో సంచార్ సాథీ యాప్ ఇన్‌బిల్ట్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్రప్రభుత్వం మొబైల్ తయా రీ సంస్థలకు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ఈమేర కు కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సిం ధియా తాజాగా యాప్ విషయంలో స్పష్టతనిచ్చారు. యాప్ ద్వారా కాల్స్‌పై ఎలాంటి పర్య వేక్షణ ఉండదని స్పష్టం చేశారు. వినియోగదారులు యాప్‌ను ఎప్పుడైనా ఇన్‌స్టాల్ చేసు కోవచ్చని, అవసరం లేదనుకుంటే అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చని తేల్చిచెప్పారు.