calender_icon.png 16 December, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, అవార్డులు సాధించడంలో పోటీపడాలి

16-12-2025 02:13:23 AM

  1. సీఎం సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ గెలవని పరిస్థితి

ఎన్నికల్లో గెలుపోటములు సహజం..

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని అందుకే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పరిపాలనను కోరుకుంటున్నారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించుకుందని ఈ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ని ప్రజలు చూపిన ఆదరణ గొప్పదని సిద్దిపేట ప్రజలను, కార్యాకర్తల అభిమానం ప్రేమ హృదయంలో ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

సిద్దిపేట నియోజకవర్గంలో 91గ్రామ పంచాయతీ ల్లో 77 గ్రామ పంచాయతీలు బి ఆర్ ఎస్ కైవసం చేసుకున్నామని, గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ నాడు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధిలో పరిడవిల్లిన పల్లెలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పడావు పడ్డాయని పరిశుభ్రత, పారిశుధ్యం పడకెసిందని, కెసిఆర్ ప్రభుత్వం లో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకున్నామని, అవార్డుల పల్లెలుగా చేసుకున్నామని గుర్తు చేశారు.

ఈ ప్రభుత్వం లో పల్లెలు అభివృద్ధి కి నోచుకొని పరిస్థితి నెలకొన్నదన్నారు. రెండేళ్లలో రాష్ట్రానికి ఒక్క అవార్డు రాలేదన్నారు. నేడు కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లతో కాలువల్లో నీళ్లు వస్తున్నాయ్ అంటే కెసిఆర్ ఘనతనే, నాడు సాగు నీటి, మంచి నీటికి నెటి కాళేశ్వరం మిషన్ భగీరథ స్ఫూర్తి సిద్దిపేట నే అని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు.

గెలిచిన ఓడిన ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. గ్రామాల అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలని గ్రామాల అభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.కొత్త సర్పంచ్ లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కొలహాలంగా మారింది. వందలాది మందితో ఆఫీస్ కొత్త ఉత్సాహంతో సర్పంచ్ లు ఆనందం తో హరీష్ రావును కలసి ఆత్మీయతను పంచుకున్నారు.