15-11-2025 01:49:28 AM
అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం
పాట్న, నవంబర్ 14: ఎన్డీయే కూటమి భారీగెలుపునకు ప్రముఖ యువ సింగర్, బీజేపీ అబ్యర్థి మైథిలీఠాకూర్ పాట ‘ఓ రాజాజీ’ కూడా ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఎన్నకల ప్రచారంలో ఆమె పాట బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతూ ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆమె ఆలీనగర్ నుంచి పోటీ చేసింది. 25 ఏళ్ల బీజేపీ అభ్యర్థి, జానపదగాయని మైథిలి ఠాకూర్ అలీనగర్‌లో 11,700 కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.
ఆర్జేడీ సీనియర్ నాయకుడు బినోద్ మిశ్రాను ఓడించి, బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతిచిన్న వయసులో ఎమ్మెల్యేగా నిలిచారు. ప్రముఖ జానపద గాయని, తొలిసారి అభ్యర్థిగా ఎన్నికైన ఆమె 63 ఏళ్ల బినోద్ మిశ్రాను ఓడించారు. తాను గెలిస్తే అలీనగర్ నియోజకవర్గం పేరును మారుస్తానని కూడా మైథిలీ హామీ ఇచ్చారు.