20 August, 2026 | 9:47 AM

Breaking News

గోడ కూలి కూలీ మృతి.. పోలీసుల దర్యాప్తు   •   పెద్దమల్లారెడ్డికి బస్సు సౌకర్యం.. విద్యార్థులకు ప్రయోజనం   •   ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను సందర్శించిన మదరోళ్ళ నిఖిల్   •   ఎడపల్లి సింగిల్ విండోలో లక్షల నిధులు దుర్వినియోగం!   •   బెల్లంపల్లి రోడ్డు ప్రమాదం.. కార్మికుడు మృతి   •   షావుకారు జానకికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స   •   కమిషనర్, సానిటరీ ఇన్స్పెక్టర్ వేధింపులకు పాల్పడుతున్నారని కార్మికుల ధర్నా   •   ఆకర్షణీయంగా రైతు బజార్‌ ఏర్పాటు   •   మంథని అభివృద్ధే లక్ష్యం.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా   •   సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం   •  

నాచగిరి నారసింహుడికి శతఘటాభిషేకం

23-05-2024 06:51 AM

గజ్వేల్, మే 22 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం శతఘటాభిషేకం నిర్వ హించారు. స్వామివారి జయంతిని పురస్కరించుకుని మూడురోజులుగా నాచగిరి క్షేత్రంలో విశేషపూజలు జరుగుతున్నాయి. బుధవారం నృసింహ జయంతి సందర్భంగా మూలమంత్రహవనము, మహాపూర్ణాహుతి, శతఘటాభిషేకం, పంచామృతాభిషేకాలు, స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించా రు. ఉత్సవాల్లో గురుమాధవానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి, గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం వా రిని ఆలయ అర్చకులు సన్మానించారు.