20 August, 2026 | 10:44 AM

నంబర్ ప్లేట్‌లేని 28 వాహనాలు సీజ్

23-05-2024 06:50 AM

జహీరాబాద్, మే 22 : వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని జహీరాబాద్ డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశాల మేరకు జహీరాబాద్ డీఎస్పీ రాంమో హన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. తనిఖీల్లో నంబర్ ప్లేట్ లేని 28 వాహనాలను సీజ్ చేశారు. అలాగే సరైన పత్రాలు లేని 130 వాహనాలపై రూ. 39,105ల జరిమానాను విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. వాహనచోదకుల డ్రైవింగ్, వాహనా లకు సంబంధించిన ఆర్‌సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు తప్పక ఉండాలన్నారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి, ఎస్సై లక్ష్మారెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.