calender_icon.png 19 July, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

'సాగర్‌'లో లీకేజీలు

19-07-2025 12:30:19 PM

- 4 క్రస్టుగేట్ల నుంచి లీకవుతున్న నీరు

- లీకవుతున్న నాగార్జునసాగర్ క్రస్టు గేట్లు..పట్టించుకోని అధికారులు! 

- నాగార్జునసాగర్‌కు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. శాశ్వత చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించడం లేదు.

నాగార్జునసాగర్, (విజయక్రాంతి): జీవనానికి అవే ఆధారం. నీళ్లతోనే మనిషికి మనుగడ. తాగు, సాగు నీరు అందించే ఆధునిక దేవాలయం సాగర్‌ రెండు తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆధునిక దేవాలయం అయిన నాగార్జునసాగర్‌ జలాశయం ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్‌(Nagarjuna Sagar) జలాశయం నిండుకుండను తలపిస్తోంది. నాగార్జునసాగర్‌కు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. శాశ్వత చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించడం లేదు.నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును 1967లో జాతికి అంకితం చేయగా, 56ఏళ్లుగా స్పిల్‌వే నుంచి నీటి విడుదల చేస్తున్నారు. 1975 నుంచే స్పిల్‌ వే మరమ్మతులు నాగార్జునసాగర్‌ డ్యాం స్పీల్‌ వే మరమ్మతులు 1975 నుంచే నిర్వహిస్తున్నారు. జలశయానికి భారీగా వరద నీరు వచ్చినప్పుడల్లా స్పిల్‌వే దెబ్బతింటూనే ఉంది.

వాస్తవానికి సాగర్‌ గేట్ల సామర్థ్యం 20లక్షల క్యూసెక్కులు కాగా,అయితే భారీ వరదలతో దెబ్బతిన్న చోట్ల మొదట్లో చిన్న చిన్న మరమ్మతులు చేశారు. 2009లో భారీగా వరద పోటెత్తినప్పుడు స్పిల్‌వే దెబ్బతిన్నది. దీంతో 2010-12 లో రూ.40కోట్లతో మరమ్మతులు చేశారు. అప్పుడు జాతీయ నిర్మాణ సంస్థ(ఎన్‌ఏసీ) సూచించిన మేరకు కాంక్రీట్‌ మిక్స్‌డ్‌ డిజైన్‌(Concrete mixed design) ప్రకారం ఎం60 గ్రేడ్‌ సిలికా ప్యూమ్‌, స్టీల్‌వైర్‌ ఫైబర్‌తో గుంతలను పూడ్చారు. ఒక క్యూబిక్‌ మీటరు పరిధిలోని గుంతలను పూడ్చేందుకు స్టీల్‌వైర్‌ ఫైబర్‌ 40 కిలోలు వినియోగించారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట మినహాయిస్తే స్పిల్‌వే ఇంతవరకూ దెబ్బతినలేదు. తిరిగి కొత్త ప్రాంతాల్లో గుంతలు పడిన చోట అదే పద్ధతిలో మరమ్మతులు చేస్తే డ్యామ్‌కు భద్రత చేకూరుతుంది. 2012లో స్పిల్‌వే భారీగా దెబ్బతిన్నది. డ్యాం స్పిల్‌వేకు ఎం60 కాంక్రీట్‌ వాడినప్పటికీ ఫలితం ఏటా మరమ్మతులు చేస్తున్న పరిస్థితులు మెరుగుపడటం లేదు ఆ తర్వాత 2013, 2020, 2021 సంవత్సరాల్లో వచ్చిన వరదలకు స్పిల్‌వేపై సుమారు 30మీటర్ల లోపు భారీగుంతలు ఏర్పడ్డాయి. స్పిల్‌వే మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఇంజనీర్లు పలుమార్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించారు. 2020, 2021లో వచ్చిన వరదలకు గుంతల పరిమాణం పెరగడం తో రాష్ట్ర ప్రభుత్వం 2022 లో రూ.20 కోట్లు మంజూరు చేసింది.

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో గతం లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది(Krishna River) మూడు నెలల పాటు పరవళ్లు తొక్కింది. దీంతో నాగార్జునసాగర్‌ జలాశయానికి(Nagarjunasagar) రోజుకు 5 నుంచి 7 లక్షల క్యూసెక్కుల మేర నీరు రావడంతో అధికారులు అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు నెలల పాటు నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగడంతో 26 గేట్లలో 20 గేట్ల కింద స్పీల్‌వే దెబ్బతినది. ముఖ్యంగా 11 చోట్ల 5 మీటర్ల వెడల్పు 10 మీటర్ల లోతులో గుంతలు పడ్డాయి. డ్యాం స్పిల్‌వేను తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని ఎన్‌ఎస్‌పీ అధికారులతో పాటు డ్యాం నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.20కోట్ల నిధులను విడుదల చేశారు. కోట్ల వెచ్చించి ఏటా మరమ్మతులు చేస్తున్నా పరిస్థితులు మెరుగుపడటం లేదు సాగర్‌ నుంచి ఏటా లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలే ప్రవాహ సామర్థ్యం గరిష్ఠంగా 20 లక్షల క్యూసెక్కులకు తగినట్లు స్పిల్‌వేను డిజైన్‌ చేశారు.

కానీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు(Nagarjunasagar Project) స్పిల్ వే మరమ్మత్తు పనులకు సంబంధించి రూపకల్పనలో భాగంగా 20 కోట్ల వ్యయంతో గత 2023 మార్చి నెలలో మొదటి దశ పనులు ప్రారంభించి చివరి దశ పనులు 2023 అక్టోబర్ నెలలో పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ పనులను చేపట్టిన స్వప్న కంస్ట్రక్షన్ గ్రూప్ కంపెనీ గతంలో ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల ద్వారా వరద ఉధృతికి ఏర్పడిన సుమారు 10 అడుగుల లోతు గుంతలను ఆధునిక పద్ధతుల ద్వారా పూడ్చామని , రాబోయే వరద ఉధృతికి ఈ భారీ గుంతలకు వేసిన కాంక్రీట్ చెదిరిపోకుండా ఉండడానికి విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన "ఎం 60 గ్రేడ్ సిలికాన్ ఫైబర్ రీ ఇన్ఫోర్స్ డ్ కాంక్రీట్" ను ఉపయోగించడం జరిగిందని గతంలో వారు తెలపడం జరిగింది. వరద రావడంతో స్పిల్‌ వోగీపై గోతులు పడి దెబ్బతింది. గుత్తేదార్లు చేపట్టిన మరమ్మతుల్లో నాణ్యత లేకపోవడంతో వరదల్లో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గుత్తేదార్లు నిర్మాణంలో నాణ్యత లోపాలు సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఏటా ప్రవాహ ఉద్ధృతికి అవి పెద్దవై పోతున్నాయి. వీటిని ఉపేక్షిస్తే సాగర్‌ భద్రతకు ముప్పు అని ఇంజినీర్లు చెబుతున్నారు.

లీకవుతున్న నాగార్జునసాగర్ క్రస్టు గేట్లు..పట్టించుకోని అధికారులు! 

ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. శ్రీశైలం నుంచి 67 వేల క్యూసెక్కుల వరద సాగర్‌కు వస్తున్నది. దీంతో నీటిమట్టం 546 అడుగులకు చేరింది. అయితే క్రమంగా పెరుగుతున్న నీటిమట్టంతో సాగర్‌ డ్యామ్‌కు ముప్పు పొంచిఉన్నది. ప్రాజెక్టులోని నాలుగు క్రస్టు గేట్ల నుంచి నీరు లీకవుతున్నది.నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు మొత్తం 26 క్రస్టుగేట్లు ఉన్నాయి. వాటిలో 8, 23, 24, 25వ నంబర్‌ క్రస్టుగేట్ల నుంచి వరద బయటకు వస్తున్నది. నాలుగు గేట్లకు రబ్బర్‌ సీల్‌ నీరు కిందికి వెళ్తున్నది. ఇలా ప్రతిరోజూ 70 క్యూసెక్కుల నీరు లీకవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే మే నెలలోనే ఆ గేట్లకు అధికారులు మరమ్మతులు చేశారు. అయినప్పటికీ నీరు లీకవుతుండటం పట్ల నిపుణులు ఆదోంళన వ్యక్తం చేస్తున్నారు.కాగా, నాగార్జునసాగర్‌కు 67,133 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. 1800 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 564.90 అడుగుల వద్ద నీరు ఉన్నది. అదేవిధంగా డ్యామ్‌లో మొత్తం 312 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 242.53 టీఎంసీల నీరు ఉన్నది.