calender_icon.png 2 May, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్న నాగేశ్వరరావు కృషి అభినందనీయం

02-05-2025 12:00:00 AM

ఖైరతాబాద్; మే 1 (విజయక్రాంతి) : పొగాకు ఉత్పత్తులతో క్యాన్సర్ సంక్రమిస్తుందని ప్రజలను చైతన్య పరుస్తూ దశాబ్దాలుగా డాక్టర్ ఒ.నాగేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమని గాంధీ దవాఖాన పరిపా లన హెచ్‌ఓడి  డాక్టర్ కె.టి.రెడ్డి అన్నారు.  డాక్టర్. ఒ.ఎన్.రావు చారిటబుల్ ట్రస్టు, డాక్టర్. రావ్స్ ఒరల్ హెల్త్ ఫౌండేషన్ సం యుక్త ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 31 వరకు  ‘నో టొబాకో మంత్’ నిర్వహించనున్న కార్యక్రమాన్ని గురువారం సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఒమెగా హాస్పిటల్ అంకాలజిస్టు డా. వింద్య వాసిని, ఎపిఎస్‌ఆర్టిసి హాస్పిటల్ ఇఎన్టి సర్జన్ డాక్టర్. ఐ. చిట్టిబాబు, సినీ మ్యూ జిక్ డైరెక్టర్ బల్లెపల్లి మోహన్ లతో కలసి ఎందుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాల చర్యలు, అవగాహన కార్యక్రమాల ఫలితంగా గతంలో ఉన్నంతగా పొగాకు వాడకం ఇప్పుడు లేదన్నారు.

అయితే, కొంతమంది సినిమాల్లో చూసి పొగాకు ఉత్పత్తులను వాడడం ఫ్యాషన్ గా మార్చుకుంటున్నారని తెలిపారు. బీడి, సిగరెట్, చుట్ట, గుట్కా వాడకంతో అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయని అన్నారు. అనంతరం డాక్టర్.ఒ.ఎన్.రావు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డా.ఒ. నాగేశ్వరరావు మాట్లాడుతూ ..

మే  నెలంతా పొగాకు వాడకం పై కలిగే దుష్ప్రయోజనాల గురించి రాష్ట్రం మొత్తం అవహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు పొగా పంట ఉత్పత్తులను తగ్గించి, వాణిజ్య పంటలను సాగు చేయాలని సూచించారు. దీంతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడే వారి పై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.