calender_icon.png 2 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమాల ఫలితమే దేశ వ్యాప్త కుల గణన..

01-05-2025 10:57:06 PM

రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే..

హనుమకొండ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ప్రకటించిన కుల గణన తీర్మానాన్ని స్వాగతిస్తున్న యంపి ఆర్.కృష్ణయ్య అన్నారు. కుల గణన కోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పని చేసిన రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గేను గురువారం హైదరాబాద్ లోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, యంపి ఆర్ కృష్ణయ్య అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని అనేక పోరాటాలు చేశామని కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. 

రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే మాట్లాడుతూ... దేశవ్యాప్త కులగల కోసం అనేక పోరాటాలు చేశామని రాష్ట్రపతి, ప్రధానమంత్రిలకు  కోటి సంతకాలతో వినతి పత్రాలు పంపామని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాం దాస్ అతవలే, బిల్ వర్మలను పదుల సార్లు కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అదే విధంగా జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, డిల్లీలో,  హైదరాబాదులో సదస్సులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమెంతో మాకంత వాటా కోసం 420 కిలోమీటర్లు మహా పాదయాత్ర చేశామని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రచ్చబండ కాడ రచ్చచేద్దాం బీసీ రాజకీయ అధికారం సాధిద్దాం సైకిల్ యాత్ర చేయడంతో పాటు గతంలో తెలంగాణలో 17 రోజుల ఆమరణ దీక్ష చేశామని, ఢిల్లీలో బీసీ ఆజాది జాక్ చైర్మన్ బత్తుల సిద్దేశ్వర పటేల్ 22 రోజుల సత్యాగ్రహ ఆమరణ దీక్ష చేశామని వివరించారు. ఫ

లితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కుల గణన చేపడుతూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిసి ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.