23 August, 2026 | 9:35 PM

నాగుపల్లిలో 120.5 మీమీ. వర్షపాతం

01-09-2025 07:48 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆదివారం అర్ధరాత్రి భారీగా వర్షం కురిసింది. దమ్మపేట మండలం నాగుపల్లిలో 120.5 మీ.మీ.ల వర్షపాతం నమోదైంది. మండల కేంద్రమైన దమ్మపేటలో కురిసిన వర్షానికి రహదారిపై అడుగు లోతు నీరు నిలిచిపోయింది. పంట పొలాలు నీట మునిగాయి. అశ్వారావుపేట, దమ్మ పేట, ములకలపల్లి, చండ్రు గుండ, అన్నపురెడ్డి పల్లి మండలాల్లో వర్షం దంచికొట్టింది. అశ్వారావుపేట నుండి వాగొద్దుగూడెం వెళ్ళే రహదారిలో చప్టాపై వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేటలో 108.5 మీ.మీ.లు, ములకలపల్లి మండలంలో 99.8 మీ.మీ.లు, దమ్మపేట మండలంలోని నాగుపల్లిలో 120.5 మీ.మీ.లు, నాయుడుపేటలో 76.3 మీ.మీ.లు, మల్కారంలో 77.5మీ.మీ.లు, మందలపల్లిలో 63.0 మీ.మీ.లు, అంకం పాలెం లో 29.0 మీ.మీ.లు, చంద్రుగొండ మండలం మద్దుకూరులో 71.o మీ. మీ.లు, అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం లో 33.8 మీ.మీ.ల వర్షపాతం నమోదైంది.