01-09-2025 07:50:31 PM
నెలకొరిగిన ప్రహరీ గోడ
మంగపేట (విజయక్రాంతి): సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి ములుగు జిల్లా(Mulugu District) మంగపేట మండలం వాడగూడెం గ్రామంలోని పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ తోట రమేష్ ఇంటి ప్రహరీ గోడ నేలకొరిగింది. గోడ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూడా ఒరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని తోట రమేష్ అన్నారు. తృటిలో తప్పిన పెను ప్రమాదాన్ని చూడడానికి గ్రామస్తులు తరలివస్తున్నారు.