06-01-2026 01:14:34 AM
వారెవ్వా స్పెషల్ పార్టీ పోలీసుల తీరు ఇది
తనిఖీల పేరిట అర్ధరాత్రి సామాన్యులకు వేధింపులు
ఎస్పీ సార్ చెప్పారు మేము చేస్తున్న మంటూ గద్దింపులు
కామారెడ్డి, జనవరి 5 (విజయక్రాంతి): దోపిడీ, దొంగతనాలు జరగకుండా అడ్డుకునాలనే నాకబంది తనిఖీలను నిర్వహించా లని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. ఉన్నత అధికారుల సదు ఉద్దేశం బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది విధులను తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులను అర్ధరాత్రి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లో దోపిడి ముఠాలు చైన్స్ నేచర్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ. క్రింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దోపిడి ముఠాలు సునాయాసంగా తప్పించుకుపోతున్నాయి. ట్యాబ్ ల ను ఇచ్చి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయవలసిందిగా జిల్లా పోలీసు అధికారులు స్పష్ట మైన ఆదేశాలిచ్చి ఉమ్మడి జిల్లాల్లో నాకాబంది ఏర్పాటు చేసి దోపిడి ముఠాలను పట్టుకునేందు నియమించిన తనిఖీ బృందం తనిఖీలను గాలికి వదిలేసి చక్కగా చలిమంట కాచుకుంటూన్నారు.
పట్టుదలతో నిజామాబాద్ సిపి సాయి చైతన్య కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందు కుగాను సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన ఒకరిద్దరు సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీకి సంబంధించిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌లను కూడా నాకాబంది తనిఖీకి నియ మించారు. కామారెడ్డిలోకి ప్రవేశించడం బయటకు వెళ్లడం ఇరుమార్గాల లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు.
కానీ దేవుని పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ చౌరస్తా సమీపంలో నిజామాబాదు వైపుకు వెళ్లే కమాన్ వద్ద ఏర్పాటు చేసిన నాకబండి పోలీస్ తనిఖీ బృందం నాకాబంది తనిఖీలను గాలికి వదిలేసి చలిమంట కాచుకుంటూన్నరు. ఈ దృశ్యం ఆదివారం తెల్లవారు జామున కనిపించింది. ఉమ్మడి జిల్లాలో దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠా లు గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో దోపిడీలకు పాల్ప డుతు పోలీసులకు సవాల్ గా మారారు. నిజామాబాద్ నగరం తో పాటు సిరికొండ నగరంలోని వినాయక్ నగర్ కలాన్, వర్ని ప్రాంతాలలో ఇళ్ల దోపిడీతో పాటు ఏటీఎంలు దోచుకొని దగ్ధం చేశారు.
మరో ఏటీఎం దోపిడీకి విపయయత్నం చేశారు. పొలాల్లో గల ఒక జువెలరీ షాపును దోచుకునేందుకు ప్రయత్నించారు. ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. ఈ దోపిడీ ముఠాలను పట్టుకునేందుకు వారి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ పార్టీ బృందంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో చెందిన ఒకరిని నియమించారు. ముఖ్యంగా తెల్లవారుజామున చలి అధికంగా ఉండడంతో జన సంచారం లేని ప్రాంతాల్లో ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతుంది.
దోపిడి ముఠా దోచుకున్న సొత్తుతో అణువైన చోటుకు పారిపోతుంది. ఇందుకుగాను కామారెడ్డి లో ఏర్పాటు చేసిన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ పార్టీ పోలీసుల తనిఖీ బృందం తనిఖీలను గాలికి వదిలేసి సామాన్యులను ముప్పు తిప్పలు పెట్టి అందిన కాడికి దండుకొని ఏం చక్క చలిమంట కాచుకుంటు కెమెరాకు చిక్కారు. అసలే ఎస్పీ పార్టీ వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
సీనియర్ ఎస్త్స్రలు ఏఎస్‌ఐ ల మాటలు కూడా వీరు ఖతార్ చేయడం లేదు. అర్థరాత్రులు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి బెదిరింపులకు పాల్పడి ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి అర్థాన్ని మార్చేస్తున్నారు. కలపతో తయారుచేసిన చౌకోట్లను తీసుకువెళ్తున్న ఆటో ట్రాలీనీ పది పరక తీసుకొని వదిలేసారు. ఏమంటే ఎస్పీ సార్ పంపించారు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ స్పెషల్ పార్టీ పోలీసులు అమాయకులను గద్దిస్తున్నారు.
ఉన్నతాధికారుల ఉద్దేశం మంచిదే అయిన క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరును తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికైనా విధులు నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. అమాయకులను అర్ధరాత్రి గద్దింపులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి వదిలిపెడుతున్నారని బాధితులు ఆరోపించారు.
నాకాబంది ఉద్దేశం బాగానే ఉన్నా విధులు నిర్వహించే కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరును తెచ్చిపెడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటే అమాయకుల కు ఇబ్బందులు కలిగిస్తున్న పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.