30 May, 2026 | 2:47 AM

సురవరం పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడం

30-05-2026 12:00 AM
  1. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం
  2. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

ముషీరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేసిందని రాష్ట్ర  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాష చైతన్య సమితి, గోల్కొండ సాహితీ కళా సమితి, విశ్వభారతి మ్యాక్స్ సొసైటీ లిమిటెడ్, నక్క వెంకటయ్య యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ స్పోరట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి 130 జయంతి పురస్కరించుకొని జరిగిన మలుగ అంజయ్య  శతావదాన కార్యక్రమం ముగింపు సభ గంట మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు  చిన్నారెడ్డి, విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం నిబద్ధత తో కృషి చేసిందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షులు  బడేసాబ్, ప్రముఖ కవి గంట మనోహర్ రెడ్డి, ప్రముఖ కవి  రామకృష్ణ చంద్రమౌళి, తెలుగు భాష చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎడ్ల కల్లేశ్, సంపాదకులు జయప్రకాష్,  కార్యదర్శులు ఎల్.  జగన్, కే.  సత్యనారాయణ, తులసి వెంకట రమణాచార్యులు, తూర్పు మల్లారెడ్డి గారు నక్క శ్రీనివాస్ యాదవ్, తలారి సురేష్, గురునాథం, దాసోజు పద్మావతి, మూర్తి శ్రీదేవి, ప్రముఖ కవయిత్రి రాధా కుసుమ, పాలడుగు సరోజిని దేవి, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులు అవధానులు ప్రముఖులు పాల్గొన్నారు.