calender_icon.png 12 December, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాగృతి కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జిగా నమ్మి జగదీష్

12-12-2025 12:00:00 AM

కొత్తగూడెం, డిసెంబర్ 11, (విజయక్రాంతి ): తెలంగాణ జాగృతి కొత్తగూడెం ని యోజకవర్గ ఇంచార్జిగా నమ్మి జగదీష్, ఐటి విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా సముద్రాల క్రాంతి కుమార్ లు నియమితులయ్యారు. వారిని నియమిస్తున్నట్టు కవిత గురువారం ప్రకటించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన నమ్మి జగదీష్ ను నియోజకవర్గ జాగృతి నూతన అధ్యక్షులుగా నియమితులు కావడం పట్ల జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ జాగృతి భద్రాద్రి జిల్లా అధ్యక్షులుగా తమకు అవకాశం కల్పించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని, తమకు ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని నమ్మి జగదీష్, సముద్రాల క్రాం తి కుమార్ తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని తమపై ఉంచి న నమ్మకంతో బాధ్యత అప్పగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవి త, ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి లకు కృతజ్ఞతలు తెలిపారు.