calender_icon.png 4 July, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారడైజ్ సెట్స్‌లో నాని

29-06-2025 12:00:00 AM

హీరో నాని తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’లో అడుగుపెట్టారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌వీఎల్ సినిమాస్ పతా కంపై సుధాకర్ చెరుకూరిఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం కోసం మరోసారి చేతులు కలిపారు. జూన్ 21న షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా సెట్స్‌లోకి నాని శనివారం వచ్చారు. వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్‌వుడ్ సన్నివేశాల షూటింగ్‌తో సినిమా జర్నీ ప్రారంభమైంది.

ఇప్పుడు నాని ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీమ్ సోషల్ మీడియాలో ‘ధగడ్ ఆగయా!’ అంటూ ఓ లుక్‌ను రిలీజ్ చేసింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్స్‌లో 40 రోజుల పాటు సాగే ఈ తాజా షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంతో పవర్‌ఫుల్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

2026, మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. 8 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.