calender_icon.png 4 July, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 3న వీరమల్లు ట్రైలర్

29-06-2025 12:00:00 AM

పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ మూవీ మేకర్స్ అభిమానులు ఓ శుభవార్త చెప్పింది. ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 3న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. పవన్‌కల్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనిపించనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రం ద్వారా తెరపైకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక కాగా బాబీ డియోల్, అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషుసేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకులు.

ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: కీరవాణి; ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వీఎస్, మనోజ్ పరమహంస; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్; స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్; కూర్పు: ప్రవీణ్ కేఎల్; కళా దర్శకత్వం: తోట తరణి.