calender_icon.png 5 July, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్త తుకారాంగా ప్రభాస్?

29-06-2025 12:00:00 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మరో సినిమా ఓకే చేశాడని వార్తలొస్తున్నాయి. చారిత్రాత్మక చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది భక్త తుకారాం బయోపిక్ అని సమాచారం. మరాఠా డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్.

భక్త తుకారాం జీవితం ఆధారంగా, ఆధ్యాత్మికత, భక్తి రసంతో కూడిన ఒక భారీ చిత్రంగా తెరకెక్కనుందట. ప్రభాస్ ఈ పాత్ర కోసం ఇప్పటికే స్క్రిప్ట్ విన్నాడని, కథపై ఆసక్తి చూపినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను కన్నడ చిత్ర పరిశ్రమలో పేరొందిన ఒక ప్రముఖ నిర్మాత నిర్మించనున్నట్టు వినవస్తోంది.

ఈ చారిత్రక చిత్రం మరాఠీ, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో లేటెస్ట్ టెక్నాలజీతో భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరిగే అవకాశం ఉందని టాక్. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉందని, భక్త తుకారాం పాత్రకు తగ్గట్టుగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించనున్నాడని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, ‘భక్త తుకారాం’ పేరుతోనే టాలీవుడ్‌లో గతంలోనే సినిమా వచ్చింది. ఈ బయోపిక్‌లో అక్కినేని నాగేశ్వరరావు నటించగా, భక్తిరస చిత్రంగా ప్రేక్షకులను మెప్పించింది. మహారాష్ట్రకు చెందిన శ్రీకృష్ణ భక్తుడే భక్త తుకారాం. మరి ఆయన జీవిత చరిత్రలో ప్రభాస్ నిజంగానే నటిస్తున్నారా.. లేదా? అనేది అధికారిక ప్రకటనతో ముడిపడి ఉన్న అంశమే.