6 July, 2026 | 1:52 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

కామారెడ్డి టౌన్ సీఐగా నరహరి..

24-06-2025 12:53 AM

కామారెడ్డి జూన్ 23, (విజయక్రాంతి): రాష్ట్రంలో పలువురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మల్టీ జోన్1 పరిధిలో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

నూతన సీఐగా వెయిటింగ్‌లో ఉన్న బి.నరహరిని నియమించారు. ఆయన గతంలో నిజామాబాద్ నగర సీఐగా పనిచేశారు. కొద్ది నెలలుగా వెయిటింగ్ లో ఆయనకు తాజాగా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. కాగా.. చంద్రశేఖర్‌రెడ్డిపై పలు ఆరోపణలు ఉండడంతో బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారితో పాటు పలువురు అధికారులతో సన్నిహితంగా ఉన్న ఈయన ఆ సమయంలో పలు సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి నుంచి ఈయన బదిలీపై ప్రచారం జరిగింది. దీంతో ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.