నారాయణపూర్ సర్పంచ్ భర్త ఆత్మహత్యా యత్నం
పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): గంగాధర మం డలం నారాయణపూర్ సర్పం చ్ భర్త ధీకొండ మధు ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డా రు. గ్రామ సభల నిర్వహణలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఇ బ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధీకొండ మధు కరీంనగర్ లోని ’వన్ హాస్పిటల్’ లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం నిర్వహించే గ్రామ సభల్లో రాజకీయ కక్షలతో ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.






