calender_icon.png 6 December, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సంపల్లి పంచాయతీ ఎన్నిక వాయిదా!

06-12-2025 11:42:34 AM

మండల ఎన్నికల అధికారి నిర్లక్ష్యం   

మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని నర్సంపల్లి గ్రామపంచాయతీ(Narsampally Panchayat election) సర్పంచ్ ఎన్నిక హైకోర్టు తీర్పుతో సంబంధిత అధికారులు వాయిదా వేసినట్టు విశ్వసనీయ సమాచారం. వివరాల్లో కి వెళ్లితే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడో విడుత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా నర్సంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్  సోనా హనుమాన్ రాథోడ్ పేరు ఆన్లైన్ ఓటర్ జాబితాలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఓటర్ జాబితాలో పేరు లేనందువలన కుభ్య తండాలో ఏర్పాటుచేసిన నామినేషన్ సెంటర్ లో సంబంధిత అధికారులు నామినేషన్ పత్రాలు తీసుకోకుండా నిరాకరించారు.

ఇట్టి విషయంపై  పలుమార్లు మండల ఎన్నికల అధికారిని నామినేషన్ గురించి బతిమిలాడిన పట్టించుకోకపోవడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. ఆమె నామినేషన్ పత్రాలను తీసుకోవాలని సంబంధిత అధికారులకు హైకోర్టు సూచించినప్పటికీ నామినేషన్ పత్రాలు తిరస్కరించడంతో అధికారుల తీరుపై బాధితురాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా నర్సంపల్లి పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు వాయిదా(Elections postponed) వేయాలని హైకోర్టు సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. సంబంధిత మండల ఎన్నికల అధికారి నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని గ్రామ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.