calender_icon.png 6 December, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాస్ఫూర్తితో పోటీలు విజయవంతంగా కొనసాగాలి

06-12-2025 01:14:47 PM

మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ 

మహబూబ్ నగర్ టౌన్: క్రీడాస్ఫూర్తితో పోటీలు విజయవంతంగా కొనసాగాలనిమాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని స్టేడియం మైదానంలో   51వ జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ (బాలుర)ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని బాగా రాణించాలని సంకల్పం అందరిలో ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను మరింత ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కురుమయ్య గౌడ్, రామచంద్రయ్య , ముత్యం, నిర్వాహకులు, క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.