calender_icon.png 20 August, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలికి వీల్ చైర్ అందజేత

20-08-2025 01:56:39 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జయసింహ

ముషీరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్ పూర్ ఇందిరా నగర్ కు చెందిన సంగం మంజుల (60) కు బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జయసింహ వీల్ చైర్ ను అందజేశారు. షుగర్ వ్యాధి కారణంగా మంజుల కాలు తీసివేయడంతో తన కుమారుడు పృథ్వి , బీఆర్‌ఎస్ సీనియర్  నాయకుడు రవీంద్ర కోక కు తెలిపారు. దీంతో రవీంద్ర కోక ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ వీల్ చైర్ ను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం శారీరక అంగవైకల్యం కారణంగా కాలు తీసివేయబడి   నడవలేని స్థితిలో ఉన్న మంజుల అనే వృద్ధ మహిళకు ఎమ్మెల్యే తనయుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు  ముఠా జైసింహ వీల్ చైర్ ను మంగళవారం అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి ఆదుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జై సింహ లకు రవీంద్ర కోక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకుడు భూతముల ఆంజనేయులు పాల్గొన్నారు.