2 March, 2026 | 9:52 AM

నర్సింగ్‌రావు సేవలు మరువలేనివి

02-03-2026 01:30 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): శాంతి భారత్ సేవా సమాజ్ అధ్యక్షునిగా, కార్మిక నాయకుడిగా దివంగత నాయకుడు సంఘ పాక నర్సింగ్ రావు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొనియాడారు. ఆదివారం భోలక్ పూర్ డివిజన్లోని ఇందిరా నగర్‌లో యూత్ కాంగ్రెస్ ముషీరాబాద్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో సంఘపాక నర్సింగ్  రావు సంతాప సభను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నర్సింగ్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఆర్ సిఐ ఎం ప్లాయిస్ యూనియన్ మినిస్ట్రీస్ ఆఫ్ డిఫె న్స్ అధ్యక్షునిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. ఇందిరా నగర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్, వెంకట్, కే.ఎల్. సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.