2 March, 2026 | 8:07 AM

506 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

02-03-2026 01:29 AM

బంజారాహిల్స్, మార్చి 1 (విజయక్రాంతి): నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అందులో బాగంగా ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వివరాలను ట్రాఫి క్ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ ప్రత్యేక డ్రైవ్‌లో పట్టుబడిన 506 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారి పట్ల జీరో టాలరెన్స్ విధానం అవలంబిస్తున్నామని స్పష్టం చేశారు. నిబంధన లు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. ప్రత్యేక తనిఖీ లు కొనసాగుతాయని ప్రకటించారు. రహదారి భద్రత విషయంలో ప్రజలు, వాహన దారులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.