03-08-2025 12:00:00 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజాచిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలో తలమీద రాసిపెట్టి ఉంటుంది’ అనే నాగార్జున పవర్ ఫుల్ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ పవర్ ప్యాక్డ్ మూమెంట్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించింది. నాగార్జున లుక్ చాలా సర్‌ప్రైజ్ చేసింది. నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపించారాయ. ‘అడుగు పెడితే విజిల్ మోగులే’ అనే పవర్ ఫుల్ బీజీఎంతో దేవా పాత్రలో రజనీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. రజనీకాంత్ స్వాగ్ ఆడియన్స్ మెస్మరైజ్ చేసింది.
‘ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావ్‌రా..’ అంటూ ఆయన చెప్పిన డైలాగులు, యాక్షన్ సీక్వెన్సులు మరోస్థాయిలో ఉన్నాయి. దిల్ రాజు, డీ సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా 2025 ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; డీవోపీ: గిరీశ్ గంగాధరన్; ఎడిటర్: ఫిలోమిన్ రాజ్; నిర్మాత: కళానిధి మారన్; దర్శకత్వం: లోకేశ్ కనగరాజ్.