28-07-2025 01:18:56 AM
500 మందికిపైగా సర్జన్లతో సదస్సు విజయవంతం
హైదరాబాద్ సిటీబ్యూరో , జూలై 27(విజయక్రాంతి): హైటెక్ సిటీలోని యశోద హా స్పిటల్స్- సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ రోబోటిక్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘జీఐ ఫోకస్’ పేరుతో రెండు రోజుల జాతీయ లైవ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్‌లో అన్నవాహిక నుంచి గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌లపై దృష్టి సారించి జీర్ణ-ఉదరకోశ క్యాన్సర్ శస్త్ర చికిత్సలు, అప్ప ర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ వరకు వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలపై చర్చించారు.
దేశం లోనే ప్రసిద్ధ జాతీయ సర్జికల్ గ్యాస్ట్రో, సర్జికల్ ఆంకాలజీ, జనరల్ సర్జరీ రంగాల నుం చి 500 మందికి పైగా సర్జన్లతో ప్రత్యక్ష లైవ్ వర్క్ షాప్, ఇంటరాక్టివ్ శిక్షణా కార్యక్రమా లు నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ.. అధునాతన లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జికల్ ఎక్సలె న్స్ ద్వారా మాత్రమే కాకుండా, వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే ఇలాంటి వేదికల ద్వారా కూడా రోగికి మెరుగైన ఫలితాలను అందించవచ్చని పేర్కొన్నా రు.
ప్రత్యేక సంరక్షణ అవసరమయ్యే వ్యాధు ల పెరుగుదల, సంక్లిష్టతకు ప్రతిస్పందనగా, యశోద హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో బారియాట్రిక్, హెర్నియా, ప్యాంక్రియాస్, రోబోటిక్, లివర్ క్లినిక్‌లతో సహా స్పెషాలిటీ క్లినిక్‌లను ప్రారంభించినట్టు తెలిపారు. సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ విజయకుమా ర్ బడా మాట్లాడుతూ..
గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఫోకస్ అనేది జీర్ణశయాంతర ఉదరకోశ క్యాన్సర్ నిర్వహణలో అత్యాధునిక క్లినికల్ ఆవిష్కరణ అని పేర్కొన్నారు. ఈ రెండు రోజుల జాతీయ లైవ్ వర్క్ షాప్‌లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అందుబాటులో కి వచ్చిన అధునాతన జీర్ణ-ఉదరకోశ శస్త్రచికిత్స వ్యూహాలు, మల్టీమోడల్ చికిత్స ప్రణాళి కపై నిపుణుల నేతృత్వంలోని లైవ్ సెషన్‌లు యువ సర్జన్లకు ఒక గొప్ప వేదిక అని తెలిపారు.
ఈ సదస్సులో అన్నవాహిక, కడుపు క్యాన్సర్‌కు అత్యాధునిక రోబోటిక్, లాప్రోస్కోపిక్, ఓపెన్ టెక్నిక్ ద్వారా అనేక గ్యాస్ట్రో సర్జరీలు విజయవంతంగా ఎలా నిర్వహించాలో ఈ సదస్సుకు హాజరైన యువ సర్జన్లకు (ప్రత్యక్ష) లైవ్ సర్జికల్ వర్క్ షాప్ ద్వారా వివరించినట్టు పేర్కొన్నారు.