ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
కామారెడ్డి, జూలై 1(విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఏబీసీ ఒకేషనల్ కళాశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ ఫరీదా బేగం హాజరై మాట్లాడుతూ వైద్యం అనేది వృత్తి కాదని సేవ పేర్కొన్నారు.
కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా మహమ్మారి సంభవించిన కాలంలో డాక్టర్లు చేసిన కృషి ప్రపంచ దేశాలు మరువయని పేర్కొంటూ వైద్య సంబంధిత కోర్సులు అయినా ఎమ్మెల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ మరియు ఫిజియోథెరపీ గ్రూపులలో అడ్మిషన్లు ఎంచుకున్న విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రముఖ డాక్టర్లకు కళాశాల చైర్మన్ గురువిందర్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైనటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ పుట్ట మల్లికార్జున్, డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి, డాక్టర్ సంతోష్ రెడ్డి, డాక్టర్ రంగ శ్రావణ్ కుమార్, డాక్టర్ యాద భానుతేజ్, డాక్టర్ సృజన్ రెడ్డి, డాక్టర్ హరీష్ పుల్సా , కళాశాల ప్రిన్సిపాల్ లు హనుమంతరావు, సత్యనారాయణ, విజయ్ కుమార్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






