calender_icon.png 2 July, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

02-07-2025 12:24:06 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల: జులై 1(విజయక్రాంతి )విద్యాలయాల్లోని ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తరగతి గదులను, అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తు న్న తీరును పరిశీలించారు.

పాఠశాల భవనం అంతస్థు పైన కిచెన్ షెడ్ నిర్మించాలని, వెంటనే ప నులు ప్రారంభించి, సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆ దేశించారు. విద్యార్థులతో నిత్యం చదవడం, రాయడంపై ప్రత్యేక దృష్టి సారించి, నిత్యం అభ్యస న చేయించాలని కలెక్టర్ సూచించారు.డెస్క్ లు తక్కువగా ఉండడంతో, వేరే పాఠశాల నుండి తె ప్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

అంగన్వాడీ కేంద్రం అకస్మిక తనిఖీ

చింతల్ ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశా రు. ఎంత మంది చిన్నారులు ఉన్నారు? ఎంత మంది వచ్చారు అనే వివరాలను ఆరా తీశారు. అర్హులైన పిల్లలందరికీ బాలామృతం, కోడిగుడ్లు అందరికీ అందించాలని నిర్వాహకులకు సూచించారు.

చిన్నారుల ఎత్తు, బరువును కొలిచి పరిశీలించారు. చిన్నారుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్, రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేదించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.