16-08-2025 08:50:08 AM
టేకులపల్లి, (విజయక్రాంతి): 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా అమృత్ సరోవర్ పథకంలో భాగంగా టేకులపల్లి మండలం గొల్లపల్లి, ప్రగాలపాడు, కోయగూడెం గ్రామ పంచాయతీలలో ఉన్న చెరువు కట్టలపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గొల్లపల్లి నందు గల సాయమ్మ చెరువు కట్టపై జాతీయ పతాకాన్ని టేకులపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి బైరు మల్లేశ్వరి జాతీయ పతాకాన్ని ఎగుర వేయగా, కట్టపై మొక్కలు నాటినారు. అదేవిధంగా గ్రామ పెద్దయిన రాంజీని ఎంపీడీవో శాలువాతో సత్కరింఛారు. చెరువు ఆయకట్టు దారులకు గ్రామ పెద్దలకు నీటి సంరక్షణ కై తీసుకోవలసిన కార్యక్రమాలను వివరించినారు. ప్రేగాళ్లగాడులో గల సాంబయ్య కుంట వద్ద జాతీయ పతాకాన్ని ఈజీఎస్ ఏపీఓ శ్రీనివాస్, కోయగూడo వెంకటప్పయ్య చెరువు వద్ద ఈసి తిరుపతయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి జేఎల్ గణేష్ గాంధీ, కార్యదర్శులు కృష్ణ చైతన్య, సతీష్,వసంతరావు, టిఏలు స్వప్న, భీముడు, ఎఫ్ఏ లు బాలాజీ, సాగర్, రామ్ చందర్ లు, చెరువు ఆయాకట్టదారులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.