calender_icon.png 16 August, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో

16-08-2025 10:07:24 AM

సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా 43వేల క్యూసెక్కుల నీటి విడుదల

నిజాంసాగర్, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు(Nizamsagar project) భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్ట్ నుండి ఐదు గేట్ల ద్వారా 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల  చేస్తుండడంతో  ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టు లోకి 19500 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగుతుందని నీటిపారుదల శాఖ ఈ ఈ సోలోమన్ తెలిపారు. ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియా పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.