calender_icon.png 16 August, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఉత్తమ అవార్డు అందుకున్న ఆర్ఐ రంజిత్ రెడ్డి

16-08-2025 08:48:26 AM

అందరి సహకారమే ఈ అవార్డుకు అర్హునైనా..

పెన్ పహాడ్: భారత దేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రెవిన్యూ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పెన్ పహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఐ రంజిత్ రెడ్డికి ఉత్తమ పురస్కారానికి ఎంపిక అయ్యాడు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో పంద్రాగస్టు రోజున తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ చె్తుల మీదుగా అవార్డు గ్రహీత రంజిత్ రెడ్డి జిల్లా ఉత్తమ ఆర్ఐ పురస్కారం అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆర్ఐ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... మండలం లోని రైతులకు, ప్రజలకు, యువతకు అందుబాటులో ఉంటూ సకాలంలో సేవలు అందించడం.. అలాగే తహసీల్దార్ లాలునాయక్, కార్యాలయ సిబ్బంది, జిల్లా ఉన్నత అధికారుల సహకారం ఉంటేనే ఈ అవార్డుకు అర్హునైనానని ఆశాభావం వ్యక్తం చేశారు.