16-08-2025 09:48:27 AM
వాషింగ్టన్: అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ(Donald Trump-Putin meeting) ముగిసింది. సుమారు 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ట్రంప్- పుతిన్ భేటీ ముగిసింది. ట్రంప్, పుతిన్ సమావేశం వివరాలు వెల్లడించారు. మరోసారి భేటీ అవుదామని పుతిన్ ప్రతిపాదించారు. తదుపరి సమావేశం కోసం మాస్కో రావాలని ప్రెసిడెంట్ ట్రంప్(Donald Trump) కు పుతిన్ ఆహ్వానించారు. ట్రంప్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని పుతిన్ తెలిపారు. చాలాకాలం తర్వాత ట్రంప్ ను కలిశానని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రధాన అంశంగా చర్చించామని వెల్లడించారు. ఉక్రెయిన్ పై ట్రంప్, తాను ఒక అవగాహనకు వచ్చామని చెప్పారు.
చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఈయూకు పుతిన్(Vladimir Putin) హెచ్చరించారు. సమావేశం ఫలప్రదంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సమావేశంలో చాలా అంశాలు చర్చించామని, కొన్ని అంశాలు మాత్రమే పరిష్కారం కాలేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Ukrainian President Volodymyr Zelensky), యూరోపియన్ నాయకులతో మాట్లాడాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. 1945 తర్వాత ఐరోపాలో అతిపెద్ద భూయుద్ధం అయిన ఈ క్రూరమైన సంఘర్షణను ముగించడానికి లేదా నిలిపివేయడానికి ఎటువంటి ఒప్పందం లేకుండానే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం ముగిసింది. ఇది మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడంలో నిజాయితీగా ఆసక్తి కలిగి ఉందని, మాస్కో దీర్ఘకాల వైఖరిని పుతిన్ పునరావృతం చేశారు.