calender_icon.png 16 August, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలి: దుద్దిళ్ల శ్రీనుబాబు

16-08-2025 09:35:15 AM

మంథని లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు 

మంథని,(విజయక్రాంతి): ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలని మంథని లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.  శుక్రవారం మంథని పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ పార్టీ జెండా ను మంథని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, మంథని పట్టణములో టాటా ఏసీ ఆటో యూనియన్ ఆద్వర్యంలో, ఫ్రెండ్స్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గణంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు  ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామ వీరులను స్మరించుకుంటూ, దేశ భక్తి భావనతో ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు శ్రీను బాబు బుక్స్ పంపిణీ చేశారు .  ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్,  మున్సిపల్ మాజీ చైర్మన్ పెండ్రు రమా, సురేష్ రెడ్డి,  ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీపతి బానయ్య, నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, పోలు శివ,  గొటిగారి కిషన్,  ఆరేళ్లి కిరణ్, మంథని శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.