calender_icon.png 16 August, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయదారులు ఎరువులు తక్కువ మోతాదులో వాడాలి

16-08-2025 09:56:10 AM

రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ కోదండ రెడ్డి

చేగుంట, విజయక్రాంతి: మెదక్ జిల్లా చేగుంట లోని హైవే లో హోటల్ ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ కోదండ రెడ్డి(Kisan Cell President Kodanda Reddy) హోటల్ ప్రారంభించిన తర్వాత కాసేపు విలేకరులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువుల కొరత ఉందని ఇబ్బంది పడకూడదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కి రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు కావలసిన ఎరువుల విలువలపై సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే కావలసినంత ఎరువుల బస్తాలు సరఫరా అయ్యే ఉండేవని అన్నారు రైతులు వ్యవసాయ పద్ధతిలో కావలసినంత ఎరువులను మాత్రమే వాడాలని ఎక్కువ మోతాదులో ఎరువులు వాడితే దిగుబడి తప్ప రావడం ఖర్చు ఎక్కువ కావడం వల్ల రైతుల నష్టపోయే అవకాశం ఉన్నందున రసాయనిక ఎరువులు తగ్గించి వ్యవసాయం చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, మండల్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మెహన్ నాయక్,కాషాబోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు