calender_icon.png 16 August, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షనికి గ్రామంలోకి చేరిన వరద నీరు

16-08-2025 09:58:27 AM

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లడంతో పాటు పలు గ్రామాలలోకి నీళ్లు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామంలో ఉన్న వాగుకు భారీగా వరద నీరు రావడంతో శనివారం ఉదయం గ్రామంలోకి నీళ్లు వచ్చాయి. ఆలయం, తాగునీటి ట్యాంక్  సమీపంలో నుంచి గ్రామంలోని గల్లిలోకి నీరు రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.