24-01-2026 10:30:26 AM
వాషింగ్టన్: మంచుతుపాన్ అమెరికాను భయపెడుతోంది. అమెరికాలోని మూడింటి రెండొంతుల రాష్ట్రాలపై తుపాన్ పంజా విసిరింది. టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా,రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. మంచుతుపాన్ తో పలు విమానాశ్రయాల్లో 800పైగా విమాన రాకపోకలు ఆలస్యం, పలు విమానాలు రద్దు అయ్యాయి. వారాంతంలో తుపాన్ మరింత ఉద్ధృతంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిన్నెసోటా, నార్త్ డకోటాలో ఉష్ణోగ్రతలు మైనస్ 46 డిగ్రీలకు పడిపోతాయని అంచనా వేస్తున్నారు. మంచుతుపానుతో జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో ఇప్పటికే పరిస్థితి ఘోరంగా ఉంది. అమెరికాలో దాదాపు 16 కోట్ల మంది గడ్డ కట్టే చలిలో వణికిపోతున్నారు. తుఫాన్ బీభత్సంతో 15 రాష్ట్రాల్లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.