10-10-2025 06:25:02 PM
చిగురుమామిడి,(విజయక్రాంతి): చిన్న ముల్కనూర్ మోడల్ స్కూల్‌లో జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్య విభాగం సైకాలజిస్టు దొండపాటి రమణాకర్ విద్యార్థులకు మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఒత్తిడి నియంత్రణకు 4-7-8, 3-3-3 పద్ధతులు, టెలీ మనస్ సేవల (14416) వివరాలు తెలియజేశారు. ప్రిన్సిపాల్ హర్జిత్ కౌర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.