calender_icon.png 10 October, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరి పోరు

10-10-2025 07:22:20 PM

సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి

పెన్ పహాడ్: జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పార్టీ అంతట తమ పార్టీ అభ్యర్థులను భరిలో నిలబెడుతున్నట్లు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతేకాదు తమ ఎజెండా బిజెపిని ఓడించడం, అవసరమైన ప్రాంతాలలో లౌకిక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. బీసీ బిల్లు అమలు కు కేంద్రంపై రాష్ట్ర ఒత్తిడి తేవాలని పెన్ పహాడ్ మండలం కమిటీ సమావేశంలో మాట్లాడారు.

బీసీ రిజర్వేషన్ అమలులో కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా పరోక్షంగా అడ్డుకుందని విమర్శించారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోని అసెంబ్లీలో చర్చ పెట్టిందని, ఆ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదంతో బిల్లును రాష్ట్రపతి, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించినా బిల్లు ఆమోదించకుండా కేంద్రం కావాలనే కాలయాపన చేస్తుందని ఆరోపించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టి కర్పించడానికే సీపీఎం ఎదురుచూస్తుందన్నారు.