10-10-2025 09:02:22 PM
పాపన్నపేట,(విజయక్రాంతి): ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. తండాకు చెందిన కేతావత్ విజయ్ కుమార్(32) మార్కెటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత రెండు రోజులుగా దిగులుగా ఉంటున్నాడు. పని నిమిత్తం గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు పలుమార్లు ఫోన్ చేసిన స్పందించ లేదు. దీంతో చుట్టూ పక్కల వెతకగా శుక్రవారం ఉదయం తండా సమీపంలో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తండ్రి రామ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.