calender_icon.png 11 October, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అన్యాయం

10-10-2025 09:50:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయ నాటకాలతో.. బీసీల రిజర్వేషన్లకు అన్యాయం చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించకుండా, కేవలం జీవో-9 ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేయడం బీసీ వర్గాలను మోసం చేయడమే అని మండిపడ్డారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ పార్టీ ఇద్దరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడిన నాటకాల పరిమళమే నేడు బీసీలకు జరిగిన అన్యాయమని ధ్వజమెత్తారు. ఈ అప్రజాస్వామిక చట్ట విరుద్ధమైన చర్యలపై హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై పూర్తి చట్టబద్ధత కల్పించి పారదర్శక ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో నాయకులు శ్రీనివాస్, వినోద్ కుమార్, అబ్దుల్ సాదిక్, తదితరులు ఉన్నారు.