10-10-2025 06:28:06 PM
తుంగతుర్తి( విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోనీ తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్నట్టు వైద్య సిబ్బందికి ప్రతినెల 1 తేదీన తమ యొక్క జీత బద్యాలు ఇవ్వాలని శుక్రవారం తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ నందు ఆసుపత్రి సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతినెల మొదటి రోజున రాకపోవడంతో, ఈఎంఐ లతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఇంచార్జ్ ఆఫీసర్ అరుణకుమారి కర్ణకరె సువర్ణ నాగమణి కవిత ఉపేంద్ర సంధ్య సుజిత అరుణ పూలమ్మ స్వాతి తదితరులు పాల్గొన్నారు