10-10-2025 06:22:31 PM
జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సిఐటియు పెద్దపల్లి జిల్లా నాలుగవ సభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు... రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల పెద్దమ్మ గుడి వద్ద జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ నవంబర్ 15,16 తేదీల్లో చారిత్రాత్మకమైన పట్టణం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా 4వ మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ మహాసభల్లో కార్మికులు,ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.
ఈ రెండు రోజుల మహాసభలకు జిల్లాలోని 32 సంఘాలు15 మండలాల నుండి అనేక పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు వెయ్యి మంది హాజరవుతారని మొదటి రోజు వేలాది మందితో భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, ఇందులో సిఐటియు అఖిలభారత రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, సిఐటియు స్వతంత్ర కార్యాచరణతో పాటు ఐక్య పోరాటాల వారిదిగా నిలుస్తూ అనేక ఉద్యమాలకు పోరాటాలకు సమ్మెలకు జిల్లాలో నాయకత్వం వహిస్తుందని, రాబోయే రోజుల్లో కార్మిక వర్గ శ్రేయస్సు కోసం మరింత పట్టుదలతో కృషి చేయడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు...