25-01-2026 04:05:18 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్,(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆదివారం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డిఓ రమాదేవిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ... 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, స్టేజి,మైకూ, పార్కింగ్,సంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, త్రాగు నీరు, విద్యుత్,శకటాల ప్రదర్శన,వందన సమర్పణ,ఉపన్యాసం ,చివరగా ముగింపు వరకు వీక్షకులకు, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.