12-08-2025 12:00:00 AM
మెదక్, ఆగస్టు 11(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ప్రజల నుండి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అదే సందర్భంలో దివ్యాం గురాలు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరులో నెలకొన్న సమస్యలను కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి నిబంధనలు, అర్హతలు పరిశీలించాలని డీఎల్పీవోను ఆదేశించారు.
అనంతరం దివ్యాంగురాలు కలెక్టర్ కు రాఖీ కట్టాలని వచ్చిన వికలాంగ సోదరీమణులను చూసి చలించిన కలెక్టర్ వెంటనే కుర్చీలోంచి లేచి వచ్చి రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోదరీ, సోదరీమణుల అనుబంధాలను ప్రేమానురాగాలను పంచుకోవడానికి రాఖీ పండుగ అద్దం పడుతుందని తెలిపారు. ప్రేమ, ఆప్యాయత అనేది చాటి చెప్పడానికి వైకల్యం అనేది అడ్డు రాదని, ఇది ప్రతి ఒక్కరి హృదయాల్లో పది కాలాలపాటు పదిలంగా ఉండాలనిఆకాంక్షించారు.