2 July, 2026 | 3:28 AM

ఉపాధి కోల్పోయాం.. జీవనాధారం చూపండి

02-07-2026 01:43 AM

కేసముద్రం, జులై 1 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ పేరుతో నాయి బ్రాహ్మణుల షాపులను తొలగించడం వల్ల ఉపాధి కోల్పోయామని, తమకు జీవనాధారం చూపాలని నాయి బ్రాహ్మణులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కేసముద్రం పట్టణాన్ని ఆధారంగా చేసుకుని పలు రహదారుల వెంట అనేక సంవత్సరాలుగా సెలూన్ షాపులు ఏర్పాటు చేసుకొని కుటుంబ పోషణ సాగిస్తున్న తమకు ఉన్నఫలంగా ఉపాధి తొలగిపోవడంతో జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నయం చూపాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు లింగాల నేతాజీ, జంపాల విక్రం, రమేష్, సురేష్, లక్ష్మీనారాయణ, అంజయ్య తదితరులు కోరారు.