రెండు వేర్వేరు ప్రమాదాలు..ఇద్దరు మృతి
అమనగల్, జులై 1(విజయక్రాంతి): మం డల పరిధిలో బుధవారం రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. అకుతోటప ల్లి వద్ద రోడ్డుపై ఆపి ఉన్న కమాండర్ వాహనాన్ని ఒక కొత్త ప్యాసింజర్ ఆటో అతివేగం గా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ట్రాన్స్జెండర్లలో అమ్ములు (26) అనే వ్యక్తి కల్వకుర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మిగిలిన ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.
మున్సిపాలిటీ పరిధి లో జంగారెడ్డిప ల్లి కల్వర్టు వద్ద టీవీఎస్ రైడర్ బైక్, అశోక్ లేలాండ్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మ డ్గుల్ మండలం ఫకీరా తండాకు చెందిన రామావత్ మల్లేష్ (28) అమంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఘటనలపై అమనగల్ పోలీసులు కేసులు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






